19-11-2024 12:00:00 AM
241.30 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. బలహీన త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో సూచీలు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ స్టాక్స్ సూచీలను పడేశాయి.
దీంతో సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయింది. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 23,450 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 77,863.54 (క్రితం ముగింపు 77,580.31) తొలుత లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,965.06 వద్ద కని ష్టాన్ని తాకింది.
ఓ దశలో కాస్త లాభాల్లోకి వచ్చినప్పటికీ.. లాభాల స్వీకరణతో మళ్లీ సూచీకి నష్టాలు తప్పలేదు. చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.90 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.40గా ఉంది.