2 July, 2026 | 3:19 PM

Breaking News

దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •  

పట్టు కోల్పోకుండా..

16-02-2025 12:00 AM

పట్టు చీరలు మహిళలకు మరింత ప్రత్యేకం. అయితే పట్టుచీరలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని సరైన విధానంలో సంరక్షించుకోకుంటే మెరుపు కోల్పోయి పాతగా కనిపిస్తాయి. పట్టుచీరలు ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా.. 

పట్టుచీరని ఒకసారి కట్టుకుని విడిచిన తర్వాత దానికి బాగా గాలి తగిలేలా ఆరేయాలి. తేమ, చల్లదనం లేకుండా పొడిగా ఆరిన తరవాతనే మడతపెట్టి భద్రపరచాలి. 

నాలుగైదుసార్లు కట్టుకున్న తర్వాత చీరని డ్రైక్లీనింగ్ చేయించవచ్చు. దీనివల్ల పట్టు చీర మెరుపు పోకుండా ఉంటుంది. చీర మీద చిన్న మరకలు లేదా మురికి అంటితే అక్కడ మాత్రమే. నీళ్లతో తడిపిన దూదితో తుడవాలి. కొద్దిగా గ్లిజరిన్ రాసి పలుచని బట్టతో తుడిచినా మరకలు పోతాయి. 

పట్టు చీరని శుభ్రం చేయాలనుకుంటే మొదటిసారి మాత్రం డ్రైక్లీనింగ్ చేయించాలి. తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నీళ్లలో ముంచి ఉతకవచ్చు. నీళ్లలో కొద్ది మోతాదులో బేబీ షాంపూని మాత్రమే కలపాలి. డిటర్జెంట్, సర్ఫ్ కలపకూడదు. చీరని నీళ్లలో ఎక్కువసేపు నాననివ్వకూడదు. చేతులతో గట్టిగా పిండకూడదు.