25 August, 2026 | 2:21 AM

ఐదోంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

25-08-2026 01:24 AM

మేడ్చల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఓ మహిళ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేరళలోని కానూరుకు చెందిన పురుషోత్తం, శీతల్ (32) దంపతులు ఆరవ పేజీలో అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.

వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా నాలుగేళ్ల కూతురు ఉంది. కూతురు, పురుషోత్తం తల్లిదండ్రులతో పాటు ఇక్కడే ఉంటున్నారు. పురుషోత్తం ఎస్బీఐలో డిఎం గా పనిచేస్తున్నారు.శీతల్ టెర్రస్ పైకెక్కి దూకింది. దీంతో అక్కడికక్కడే మరణించారు. శీతల్ డిప్రెషన్ వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూకట్‌పలల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.