Breaking News

అమెరికాలో దమ్మాయీగూడవాసి మృతి

25-08-2026 | 01:26am

జవహర్ నగర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): దమ్మాయిగూడ శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన సాయి ప్రదీప్ అమెరికాలో మృతి చెందడం విషాదం నింపింది. ఈ నెల 21న ఆయన మరణించినట్లు సమాచారం.2024లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన సాయి ప్రదీప్ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ శాన్ ఆంటోనియోలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్న యువకుడు మృతి చెందడంతో దమ్మాయిగూడ, శ్రీనివాస్ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు