మేకను రక్షించబోయి నీటి కొలనులో పడి మహిళ మృతి
బచ్చన్నపేట. జూన్ 30 (విజయక్రాంతి) మేకప్రాణం కాపాడబోయి ఓ మహిళ నీటి కొలనులో పడి మృతి చెందిన విషాద ఘటన బచ్చన్నపేట మండలం మొండికుంట గ్రామ సమీపంలో. చోటు చేసుకుం ది. చిన్నరామంచర్ల గ్రామానికి చెందిన గుం డా వాణి (33) మొండికుంట సమీపంలోని. ఓ వ్యవసాయ బావి దగ్గర ఏర్పాటు చేసిన నీటి. కొలనులో పడిన మేకను రక్షించే క్ర మంలో ప్రమాదవశాత్తు కాలుజారి లోపల పడిపోయింది ఈత రాకపోవడంతో ఆమె నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది.
వి షయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ప్రజలు నీటి కొలనులు, చెరువులు, కాలువలు ఇతర నీటి వనరుల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఒంటరిగా నీటిలో దిగరాదని బచ్చన్నపేట పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు






