16 April, 2026 | 12:40 PM

కేఎల్‌ఐ కాల్వలో పడి మహిళ మృతి

07-05-2025 12:58 AM

కల్వకుర్తి మే 6: కల్వకుర్తి పట్టణంలోని పంజుగుల రోడ్డు సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వలో అనుమానాస్పద స్థితిలో ఉన్న మ హిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు మార్చాల గ్రామానికి చెందిన ప్రభావతి(40) గా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాలువలో నుండి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.