calender_icon.png 7 May, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులు మంచి సత్‌ప్రవర్తనతో మెలగాలి

07-05-2025 01:00:29 AM

సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర

మహబూబ్ నగర్, మే 06 ( విజయక్రాంతి ) : విద్యార్థినీలు మంచి క్రమశిక్షణ , సత్ప్రవర్తనతో మెలగాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సూచించారు. మంగళవారం ఆమె ఏనుగొండ లోని రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

నైతిక విలువలు పెంపుదలపై అవగాహన కల్పించారు. మంచి నడవడిక కలిగి ఉండి ఆత్మస్థైర్యం తో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు ఎవరు లేరని భావన ఉండరాదని సన్నిధి నిర్వాహకులు, సిబ్బందియే తమ తల్లిదండ్రులుగా భావించి వారితో తమ సాధక బాధకాలను  పంచుకోవాలని సుంచించారు. 

తమ పిల్లల మాదిరిగా  సేవలందిస్తున్న సిబ్బందిని గౌరవించాలన్నారు.   ఈ కార్యక్రమంలో డి సి పి ఓ నర్మద,రెడ్ క్రాస్ కోశాధికారి ఎస్.జగపతి రావు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి.రమణయ్య, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్,   సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ, రెడ్ క్రాస్ మేనేజర్ అనేల నరసింహా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.