07-05-2025 12:57:55 AM
రూ 12.36 లక్షల విలువ
భద్రాద్రి కొత్తగూడెం మే 6 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో మంగళవారం పురుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి చతిస్గడ్ అక్రమంగా తరలిస్తు న్న రేషన్ బియ్యం లారీని వన్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ కరుణాకర్ తెలిపి న వివరాల ప్రకారం సాధారణ తనకి లో భాగంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ఎస్త్స్ర విజయ్ కుమారి తన సిబ్బందితో వాహన తనిఖీ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో సిజి సీ జి 04 పి ఎక్స్ 0717 నెంబర్ గల లారీ అనుమానస్పదంగా కనిపించడంతో లారీని ఆపి తనిఖీ చేయగా 687 బస్తాల్లో సుమారు 343 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని పొ రుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన రేషన్ బియ్యాన్ని ప్రజల నుంచి కిలో రూ 12 చొప్పున కొనుగోలు చేసి చతిస్గడ్ రాష్ట్రానికి తరలించి కిలో రూ 20 చొప్పున విక్రయిస్తున్నట్లు తమ విచారణలో బహిర్గతమైందన్నారు.
బియ్యం లారీ తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. బియ్యంతో కూడిన లారీని సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు