calender_icon.png 17 May, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో మహిళ మృతి

17-05-2025 09:50:52 AM

అశ్వారావుపేట,(విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదచాయలను నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. వినాయకపురంలో వేల్పుల రూప(22) అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం ఇనుప వైరు పై బట్టలు ఆరవేస్తుండగా  వైరుకి విద్యుత్ సరఫరా జరిగి రూప విద్యుత్ షాక్ కు గురైంది. విద్యుత్ స్తంభం నుండి ఇంట్లోకి వచ్చిన సర్వీస్ వైరు ఇంటిముందున్న రేక ల  షెడ్ మీదుగా కనక్షన్ ఇచ్చారు.

సర్వీస్ వైర్ పాడైపోయి రేకుల షెడ్ కు విద్యుత్ సరఫరా అవుతుం ది. బట్టలు ఆరవేయడానికి కట్టిన ఇనుపవైర్ రేకుల షెడ్ కు తగలటంతో ఈ వైరు కు విద్యుత్ సరఫరా జరుగుతుంది. దీనిని గమనించకుండా వేల్పుల  రూప బట్టలు ఆరవేయటంతో విద్యుత్ షాక్ కు గ రైంది. విద్యుత్ సరఫరా అవ్వడంతో ఆమె అందరూ చూస్తుండగానే చేతులు, శరీరం వణుకుతూ మాడిపోయాయి. పరిసరాల్లోని వారు వైరునుండి ఆమెను వేరు చేసి అశ్వారావుపేట ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమెకు భర్త, ఇదరు సంతానం  ఉన్నారు భర్త కిషోర్ పిర్యాదు మేరకు ఎస్ ఎచ్ ఒ అఖిల కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.