17-05-2025 10:10:17 AM
తిరుమల,(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్స్ అన్ని నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందిన టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 70,970 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే 33,871 మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.56 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.