17-05-2025 01:23:58 AM
-ప్రభుత్వ స్థలాలను అమ్మొద్దు
- గాంధీ నగర్‌లో అండర్ 14 పిల్లల క్రికెట్ టోర్నీని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ముషీరాబాద్, మే 16 (విజయక్రాంతి) : విద్యా సంస్థలు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం భోలక్ పూర్ డివిజన్ లోని శ్రీనివాస ప్లే గ్రౌండ్లో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, సినీ చారిటబుల్ ట్రాస్ట్ సం యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 క్రికేట్ టౌర్నమెంట్ 2025 పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... దేశంలో మన రాష్ట్రంలో ప్లే గ్రౌండ్ కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. బస్తీలు, కాలనీలలో ఉన్న ప్లే గ్రౌం డ్లను కాపాడుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. కొంత మంది ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చుతున్నారని దీనివల్ల పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ గ్రౌండ్లు కరువవుతున్నాయని పేర్కొన్నారు. ప్లే గ్రౌండ్లను పరిరక్షించుకొ ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
జీహెచ్ ఎంసీ, ప్రభుత్వ క్రీడా మైదానాలు కొంత మంది వ్యక్తులు, సంస్థలు ఆక్రమణకు యత్నిస్తున్నాయని, వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వాటిని పరిరక్షిం చుకోవాలని డిమాం డ్ చేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ మానసిక ఆరోగ్యానికి, ఉజ్వల భవిష్యత్తుకు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో సినీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, కార్పొరేటర్ రచన శ్రీ, బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భర త్ గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రామ్, గాంధీనగర్ డివిజన్ బీజే పీ అధ్యక్షుడు నవీన్ కుమార్, నాయకులు ఆనంద్ కుమార్, రత్న సాయిచంద్, శివాజీ, శ్రీకాంత్, దామోదర్, ఉమేష్, వీఎస్టి రాజు, శ్రీనివాస్, మహమూద్ పాల్గొన్నారు.