14 July, 2026 | 7:39 AM

పసుపు ప్యాకెట్లలో గంజాయి.. కిలాడీ లేడీ అరెస్ట్

09-09-2024 04:37 PM

హైదరాబాద్: గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న మహిళను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పసుపు ప్యాకెట్లు మాటున మహిళ గంజాయి విక్రయిస్తోంది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు ధూల్ పేటకు చెందిన నేహా బాయిని అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ తిరుపతి యాదవ్‌, ఎస్‌ఐ నాగరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో 10 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి నిషిద్ధ వస్తువులు తీసుకొచ్చి వివిధ పద్ధతిలో విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 10 గ్రాములకు పైగా గంజాయి ఉన్న సాచెట్‌ను నేహా భాయ్ రూ.600కు విక్రయిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.