10 March, 2026 | 6:31 AM

మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలు

09-03-2026 01:02 AM
  1. దేశాభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం
  2. మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడివున్నదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. సంతానోత్పత్తి అనే అని వార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మ నుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక  కష్టాలతో నిర్వర్తిస్తున్న మహిళ త్యాగశీలి అని కొనియాడారు. మహిళా సాధికా రతను మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

పసుపు పంటకు.. మార్కెట్ ఏది?

వనపర్తికి కేంద్రియ విద్యాలయం

మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలు