సంక్షేమ గురుకుల పాఠశాల ఎదుట మహిళ ధర్నా
10-12-2024 07:16 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ డబ్బులకు ఆశపడి తనకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఉష అనే ఓ మహిళ పాఠశాల ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను వాచ్మెన్ విధుల నుండి ఆకారణంగా తొలగించారని డబ్బులకు ఆశపడి వేరే మహిళను విధుల్లోకి తీసుకొనే ప్రయత్నం చేస్తుందన్నారు. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని ఉష స్పష్టం చేశారు. తనను తొలగించాలనే ఉద్దేశపూర్వకంగా పాఠశాల ప్రిన్సిపాల్ సొసైటీలో నిబంధనలను అడ్డు చూపుతూ పాఠశాలకు సంబంధం లేని మరో మహిళను విధులు అప్పగించే ప్రయత్నం చేస్తుందని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.






