calender_icon.png 2 May, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ సేఫ్ యాప్‌తో మహిళా భద్రత

21-04-2025 08:44:47 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా టి సేఫ్ యాప్ ప్రవేశపెట్టిందని, ఈ యాప్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మహబూబాబాద్ షీ టీం ఎస్సై సునంద తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో మహిళలకు టీ సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు,100 డయల్, 1930 టోల్ ఫ్రీ, 8712656935 ఫోన్ నెంబర్ ద్వారా మహిళలకు అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ జగదీష్, ఏవో గఫర్, ఉమెన్ పి ఎస్ ఎస్ ఐ ఆనందం, భరోసా, షీ టీం సిబ్బంది అరుణ, పార్వతీ, రమేష్, సుప్రజ బేబీ పాల్గొన్నారు.