29-11-2024 11:50:14 PM
రాష్ట్ర వ్యవసాయశాఖ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయ భవనంలో ఇందిరా మహిళశక్తి క్వాంటిన్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను లక్షధికారులుగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలకు క్యాంటీన్ల ఏర్పాటు, ఇతర వ్యాపార రంగాలకు సంబంధించిన వాటికి ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు రుణసదుపాయం కల్పిస్తున్నారన్నారు.
మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొరారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని మాత శిశు ఆసుపత్రి ఆవరణలో తాత్కలికంగా నిర్మించే షెడ్డూ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రో కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాల్రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దిచంద్రకాంత్రెడ్డి,మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.