23-09-2025 12:27:27 PM
వేధిస్తున్న యూరియా కొరత
అర్ధరాత్రి నుండే రైతు వేదికల వద్ద పడి కాపులు
నిలబడలేని స్థితి, చెప్పులే క్యూ లైన్
నకిరేకల్,(విజయక్రాంతి): యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్‌కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసిన, పత్తి మొక్కలకు కాయలు పడే సమయంలో యూరియా సకాలంలో తప్పనిసరిగా వేయాలి. ఈ క్రమంలో రైతులు యూరియా కోసం వ్యవసాయా కార్యాలయాలు, సొసైటి కార్యాయాలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగ్సాలి వస్తుంది.
మంగళవారం నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలో రైతు వేదికల వద్ద అర్ధరాత్రి నుండే వివిధ గ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిలబడలేని స్థితిలో రైతులు చెప్పులు పెట్టి క్యూలైన్ కట్టారు. రైతు వేదిక తీసే సమయంలో రైతుల ఒకసారి గా నెట్టి వెసుకున్నారు. దీంతో పోలీస్ సిబ్బంది వచ్చి రైతులకు సర్ది చెప్పి. యధావిధిగా లైన్లు కొనసాగించారు. ఈరోజు రెండు లారీలు 888 బస్తాల యూరియా వచ్చింది. యూరియా కోసం రైతు వేదిక వద్దకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో అగ్రికల్చర్ అధికారులు, , పోలీసు సహకారంతో ఒక రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశారు. .