23-09-2025 12:54:22 PM
సిద్దిపేట రూరల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీతారాంపల్లి గ్రామంలో సీతారాం యూత్ అసోసియేషన్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాము భక్తులను ఆకర్షిస్తున్నాయి. పూలతో అలంకరించిన మండపంలో ప్రత్యేక పూజలు, హారతులు, భక్తి కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని విభిన్న రూపాలలో అలంకరించి పూజలు నిర్వహించనున్నారు.