బాచ్చాయిపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు
08-03-2026 05:36 PM
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి సర్పంచ్: ప్రేమలత యాదగిరి
సిద్దిపేట రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాచ్చాయిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం మహిళలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరి, ఉప సర్పంచ్ అనుప్రమా శ్రీనివాస్ హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లక్ష్మీ రాజేశం, రామచంద్రం, ఆశ వర్కర్లు, సీఏ మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.




