13 March, 2026 | 6:58 AM

సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

08-03-2026 05:40 PM

ప్రత్యేక క్రీడా పోటీలు

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్‌ సర్కిల్ పరిధి కొండాపూర్ లోని సంస్కృతి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్మిత–ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల పలు పాఠశాలలు, కళాశాలల నుండి సుమారు 650 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుపందాలు, ఫన్నీ గేమ్స్ నిర్వహించారు. పోటీలు అండర్-13, అండర్-18,  పైబడిన విభాగాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. జనకిరాములు, డైరెక్టర్ డాక్టర్ ఎం. రమాకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులను అభినందించారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు.