18-09-2025 12:58:18 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ సెప్టెంబర్ 17: మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం స్వస్త్ నారీ సశక్ట్ పరివార్ అభియాన్ అనగా ఆరోగ్య మహిళ, శక్తివంతమైన కుటుంబం కార్యక్రమాన్ని కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఆరోగ్య కేంద్రాల యందు ప్రత్యేక మహిళా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి,ప్రత్యేక వైద్య నిపుణులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు.
వైద్యశిబిరాల్లో నేత్ర, దంత, చర్మ, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, దెర్మటాలజీ, సైక్రియాట్రిస్ట్ వైద్య నిపుణులు పాల్గొని సేవలందిస్తారని బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, హిమోగ్లోబిన్, నేత్ర, గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. అవసరమైన మందులను అక్కడికక్కడే అందజేస్తారని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని అలాగే మహిళలకు రక్త హీనతకు గురి కాకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని అలాగే అవసరమైన మందులను కూడా వైద్యశిబిరంలో పంపిణీ చేస్తారని ఇట్టి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, డి సి హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ సూపరిటీడెంట్ దశరద,డిప్యుటీ డి ఎం హెచ్ ఓ జయమనోహరి, ఆర్డీవో సూర్యనారాయణ, కమిషనర్ రమాదేవి ఎమ్మార్వో వాజిద్ అలీ, డాక్టర్లు అధికార సిబ్బంది లో పాల్గొన్నారు .