calender_icon.png 18 September, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల త్యాగ ఫలితమే ప్రత్యేక రాష్ట్రం

18-09-2025 12:58:47 AM

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): అమరవీరుల త్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో అంతర్భాగ మైన రోజును పురస్కరించుకొని నిర్వహించిన తె లంగాణ ప్రజాపాలన‘ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో నిజాం చెర నుండి తెలంగాణ సంస్థా నం విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైందని, ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెం బరు 17వ తేదీని ’తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఆనాటి వీరయోధులైన కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య,

రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరె డ్డి నర్సింహా రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రజాకవి కాళోజీ లాంటి వీర యోధులను స్మరించుకోవడం అందరి కర్తవ్యం అన్నారు నిజాం రాజు హైదారాబాద్ సంస్థానాన్ని భా రత్ లో విలీనం చేయడానికి నిరాకరిస్తే అప్పటి ప్రధాని నెహ్రూ సూచనల మేరకు, హెూమ్ మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదారాబాద్ సంస్థానా న్ని విలీనం చేశారన్నారు.

ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై 1956 నుండి ప్రత్యేక తెలంగాణ కోసం గళం ఎత్తినా, 1969 లో తీవ్ర స్థాయిలో ఉద్యమించినా, చివరకు తుది దశ ఉద్యమం లో వి ద్యార్థుల ఆత్మ బలి దానాలతో చలించిన శ్రీమతి సోనియా గాంధీ  ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారం అయిందన్నారు.

రాష్ట్రంలోనరాష్ట్రంలోనిప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు అ నుగుణంగా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.రాష్ట్రంలో ప్ర జా పాలన, పారదర్శక పాలన సమాజంలోని అన్నీ వర్గాలకు స్వేచ్చా సామాజిక న్యా యం, సమాన అవకాశాలు దక్కాలనేదే ఈ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దార్శినిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధికల్పన, అభివృద్ధి స ంక్షేమంతో పాటు ఐటి నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతికాలంలోనే సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

జగిత్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా 5 కోట్ల 41 లక్షల మంది మహిళలకు ఉచితంగా బస్సు ప్రవాహన సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. తద్వారా రు 279 కోట్ల 93 లక్షల రూపాయల లబ్ధి పొందారని తెలిపారు.మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 89 వేల725 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగిందని, ఇందుకు గాను 23 కోట్ల 74 లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు.

గృహజ్యోతి పథకం ద్వారా జీరో విద్యుత్ బిల్లుల రూపంలోరు. 125 కోట్ల 62 లక్షల ను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ రైతు బీమా,రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాల ద్వారా జిల్లాలో వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మన జిల్లాలో ఇంటి స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న 10 వేల 775 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

భూ భారతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో, రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుండి భూ సమస్యల ధరఖాస్తులు స్వీకరించామని,ఇప్పటి వరకు 25 వేల 672 మంది రైతుల నుండి ధరఖాస్తులు తీసుకోని భూ భారతి పోర్టల్ ద్వారా శరవేగంగా అర్జీలను పరిష్కరిస్తున్నామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు 38 వేల 619 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని,

ఇందులో 75 వేల 52 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో 3 లక్షల 45 వేల 710 కుటుంబాలకు గాను ప్రతి నెలా 6 వేల 356 టన్నుల సన్న బియ్యం పంపిణి చేస్తున్నామని తెలిపారు.షెడ్యూల్ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాల నిర్వహణ తో పాటుఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు.

రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృ ద్ధిలో ముందు ముందు ఇలాంటి సహకారమే అందించాలని కోరారు.