18-09-2025 12:57:02 AM
పుట్ట నువ్వు మాట్లాడే తీరు మార్చుకోవాలని హెచ్చరిక
ముత్తారం, సెప్టెంబర్17(విజయక్రాంతి) రాజకీయంలో ఓనమాలు నేర్పించి రాజకీయ బిక్ష పెట్టిన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు పై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ముత్తారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, ఏఎంసి వైస్ చైర్మన్ మద్దెల రాజయ్యలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ స్పీకర్ శ్రీపాద రావు విగ్రహాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. శ్రీపాదరావు వల్లే రాజకీయంగా ఎదిగిన పుట్ట మధుకు ఆయనను విమర్శించే హక్కు లేదన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అనవసరపు ఆరోపణలతో పుట్ట మధు మం థని ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నారని, లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ భయంతోనే మధు చౌకబార్ ఆరోపణలు చేస్తున్నారని, ఇకపై శ్రీ పాదరావు శ్రీధర్ బాబు లపై అనుచిత వ్యా ఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
మంథని నియోజకవర్గ ప్రజలు శ్రీపాదరావు ను మూడుసార్లు శ్రీధ ర్ బాబును ఐదుసార్లు ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించడం జరిగిందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు నిత్యం ప్రజల్లో ఉం టూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకా సమస్యలు పరిష్కరిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రా జ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారందరిని సమానంగా చూ స్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు రాబోయే రోజులలో ఈ ప్రాంతాలు ఉన్నటువంటి శ్రీపాదరావు విగ్రహాలను కుల్చుతామని మాట్లాడడం సిగ్గు చే టాన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మ న్ అల్లాడి యాదగిరిరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లినేని బుచ్చమరావు, మాజీ స ర్పంచులు తూటి రజిత రఫీ, తాటిపాముల వరలరాణి శంకర్, మండల సోషల్ మీడి యా ఇన్చార్జి కోల విజయ్, ఎస్సీ సెల్ మం డల అధ్యక్షుడు ఎడవేనా సంపత్,
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాష, కిషన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, నాయకులు కుక్కల చందు, అ మ్ము వెంకటస్వామి, గుడి కొండల్ రెడ్డి, కాశిఒజ్జుల చారి, అల్లం దేవేందర్ రెడ్డి, తోడేటి శశికుమార్, ఆకోజు అశోక్, లక్కం రాజు, ప సునూటి శంకర్, మాదాసిరాజు, కలవచర్ల రాజకుమార్,తదితరులు పాల్గొన్నరు.