13 April, 2026 | 12:48 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

మహిళల వన్డే ప్రపంచ కప్-2025 పూర్తి షెడ్యూల్‌ విడుదల...

16-06-2025 06:59 PM

మహిళల వన్డే ప్రపంచకప్(Women's ODI World Cup) 13వ ఎడిషన్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. తాజాగా, మహిళల వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంకలోని ఐదు వేదికల్లో మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు భారత్ లో చిన్నస్వామి(బెంగళూరు), ఏసీఏ(గువాహటి), హోల్కర్(ఇందౌర్), ఏసీఏ-వీడీసీఏ(విశాఖపట్నం), శ్రీలంకలోని ఆర్.ప్రేమదాస(కొలంబో) మైదానాలు ఆతిథ్యం వహించనున్నాయి.

అక్టోబర్ 29వ తేదీన గువాహటి లేదా కొలంబోలో మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్-1 మ్యాచ్, అక్టోబర్ 30న బెంగళూరులో సెమీఫైనల్-2 మ్యాచ్, నవంబర్ 2వ తేదీన జరిగే  ఫైనల్ మ్యాచ్ కు బెంగళూరు లేదా కొలంబో అతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. కాగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ అక్టోబర్ 5న కొలంబో వేదికగా తలపడనుంది.

మహిళల వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్:

సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక - బెంగళూరు

అక్టోబర్ 1: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - ఇండోర్

అక్టోబర్ 2: బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ - కొలంబో

అక్టోబర్ 3: ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా - బెంగళూరు

అక్టోబర్ 4: ఆస్ట్రేలియా vs శ్రీలంక - కొలంబో

అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ - కొలంబో

అక్టోబర్ 6: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా - ఇండోర్

అక్టోబర్ 7: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ - గౌహతి

అక్టోబర్ 8: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ - కొలంబో

అక్టోబర్ 9: ఇండియా vs దక్షిణాఫ్రికా - వైజాగ్

అక్టోబర్ 10: న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ - వైజాగ్

అక్టోబర్ 11: ఇంగ్లండ్ vs శ్రీలంక - గౌహతి

అక్టోబర్ 12: ఇండియా vs ఆస్ట్రేలియా – వైజాగ్

అక్టోబర్ 13: దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ - వైజాగ్

అక్టోబర్ 14: న్యూజిలాండ్ vs శ్రీలంక - కొలంబో

అక్టోబర్ 15: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ - కొలంబో

అక్టోబర్ 16: ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ - వైజాగ్

అక్టోబర్ 17: దక్షిణాఫ్రికా vs శ్రీలంక - కొలంబో

అక్టోబర్ 18: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ - కొలంబో

అక్టోబర్ 19 : ఇండియా vs ఇంగ్లాండ్ – ఇండోర్

అక్టోబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్ - కొలంబో

అక్టోబర్ 21: దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ - కొలంబో

అక్టోబర్ 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - ఇండోర్

అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ - గౌహతి

అక్టోబర్ 24: పాకిస్థాన్ vs శ్రీలంక - కొలంబో

అక్టోబర్ 25: ఆస్ట్రేలియా vs శ్రీలంక - ఇండోర్

26 అక్టోబర్: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ - గౌహతి

అక్టోబర్ 26: ఇండియా vs బంగ్లాదేశ్ - బెంగళూరు

అక్టోబర్ 29: సెమీ-ఫైనల్ 1 – గౌహతి/కొలంబో

అక్టోబర్ 30: సెమీ-ఫైనల్ 2 – బెంగళూరు

నవంబర్ 2: ఫైనల్ – కొలంబో/బెంగళూరు