calender_icon.png 9 May, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

19-04-2025 01:12:53 AM

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 

ఎల్బీనగర్, ఏప్రిల్ 18 : ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో  మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లలో అధికారులు, సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను కమిషనర్ సుధీర్ బాబు సమీక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ ఇతర విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ అంశాలను సమీక్షించారు.

సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా భద్ర తకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీసీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్త్స్రలు, సిబ్బంది ఉన్నారు.