13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గోపురంపై సూర్య కిరీటం

23-03-2026 01:06 AM

రామప్పలో అద్భుత దృశ్యం

విజయక్రాంతి, వెంకటాపూర్(రామప్ప): ప్రపంచ ప్రసిద్ధి రామప్ప దేవాలయం వద్ద ప్రకృతి చరిత్రల సంగమాన్ని తలపించే అద్భుత దృశ్యం ఆదివారం ఉదయం దర్శనమిచ్చింది.. సూర్యోదయం సమయంలో దేవాలయ గోపురం మస్తకంపై సూర్యుడు కచ్చితంగా నిలిచి, కిరీటం ధరించినట్టుగా కనిపించడం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ యునెస్కో వారసత్వ కట్టడం మీద సూర్యకిరణాలు పడటంతో గోపురంలోని ప్రతి శిల్పం మరింత స్పష్టంగా, కళాత్మకంగా మెరిసింది.

ఆకాశంలో విరిసిన నారింజ రంగు వెలుగులు దేవాలయ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఈ అరుదైన క్షణాన్ని ’విజయక్రాంతి’ కెమెరా బంధించింది. ఈ దృశ్యాన్ని చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాల మహిమ కలిసినప్పుడు ఇలాంటి అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయని స్థానికులు అంటున్నారు.