పేదప్రజల సంక్షేమానికి కృషి
వంద రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసి న కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 అమలు చేశామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏండ్లు అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్షంగా ఉండే ఓపికలేదన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌ను భారీ మెజర్టీతో గెలుపించాలని కోరారు.
బీజేపీ అభ్యర్ధి బీబీ పాటిల్ పది సంవత్సరాలు బీఆర్‌ఎస్‌లో ఎంపీగా ఉండి నియెజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సురేశ్ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలుపించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, సంజీవరెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






