విద్యుత్ అధికారి ఇంటిపై ఏసీబీ సోదాలు

25-04-2024 01:22:50 AM

మేడ్చల్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : సస్పెండ్‌లో ఉన్న విద్యుత్ శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిం చగా విలువైన ఆస్తుల పత్రాలు లభించినట్లు వెళ్లడించారు. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ కీసరాలో ఏఈగా విధులు నిర్వహిస్తుండేవారు. అయితే 2023 ఫిబ్రవరిలో రూ.12వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో సస్పెండ్‌లో ఉన్న అనిల్ కుమార్ ఇంట్లో  బుధవారం సోదాలు నిర్వహించగా రూ. 34లక్షల నగదు, 20 తులాల బంగారం, కోటి రూపాయల విలువైన స్థిరాస్తుల పత్రాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తెలుస్తుందని, బంధువుల ఇండ్లలోనూ సోదాలు జరిపే అవకాశం ఉందన్నారు.