8 May, 2026 | 12:11 AM

రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి

23-06-2024 02:51 AM
  • ఎంపీ ధర్మపురి అరవింద్

కోరుట్ల, జూన్ 22 : రానున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెండవసారి గెలుపొందిన తర్వాత శనివారం మొదటిసారిగా కోరుట్లకు వచ్చిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కమల వికా సానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనా రాయణరావు,

అసెంబ్లీ కనీనర్ చెట్లపల్లి సుఖేందర్‌గౌడ్, రుద్ర శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు రఘు, పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్, పెండెం గణేష్, బీజేవైఎం రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు దోనికిల నవీన్, కౌన్సిలర్ మర్రిపోచయ్య, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేట విజయ్, పట్టణ ప్రధాన కార్యదరి కుడుకల రఘు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నూనె క్రాంతికిరణ్, పట్టణ ప్రధాన కార్యదరి కలిగోటశ్రీకాంత్, పట్టణ కార్యదరి భీమనాతి విజయ్ పాల్గొన్నారు.