calender_icon.png 1 August, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి,ఎడమ కాల్వల పనుల ప్రారంభం

31-07-2025 12:00:00 AM

ఇప్పటికే మత్తడి నిర్మాణం పూర్తి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

జగిత్యాల అర్బన్, జూలై 30(విజయ క్రాంతి): త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి, ఎడమ కాల్వల పనులు ప్రారం భం కానున్నాయని రాష్ట్ర ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.బుధవారం భీమారం మండల కేంద్రంలో భీమారం, మేడిపల్లి, కథలాపూర్ మూడు మండల ప్రజల జలప్రదాయని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పై జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,ఇంజనీరింగ్ అధికారులు కాం ట్రాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక రివ్యూ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను ముమ్మరంగా కొనసాగించాలని కాంట్రాక్టర్ కు సూచించారు.గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన 3 ఎకరాల భూ సేకర ణ నష్ట పరిహారాన్ని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి ఇవ్వడం జరిగిందన్నారు . స్టేజి 2 ఫేస్ 1 శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2005లో 1731 కోట్లతో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు..రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.

ఆనాడే నిధులు మం జూరయినా పనులు పూర్తి చేయలేదన్నారు. 2018 ఎన్నికల్లో 200 కోట్లతో ఆనాడు అప్పటి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఫౌండేషన్ వేసి ఈ దసర కే నీళ్లు ఇస్తామని చెప్పి అలాంటి దసరాలు ఎన్ని పోయినా కానీ ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున అనేక ఆందోళనలు చేశామని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కాలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికార్లకు సూచించి రాష్ట్రంలోనే మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తీ చేసే వాటిలో చేర్చి రు.350 కొట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందని, ఇప్పటికే మొత్తం నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులుపాల్గొన్నారు.