calender_icon.png 2 August, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి

31-07-2025 12:00:00 AM

కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆస్మా

జహీరాబాద్, జూలై 30 : విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని జహీ రాబాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షు రాలు ఆస్మా అన్నారు. బుధవారం జహీరా బాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం లోని కస్తూర్బా పాఠశాలలో ఆమె విద్యార్థు లతో మాట్లాడారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్  చంద్రశేఖర్ సూచన మేరకు హాస్టల్ వెళ్లి తనిఖీ చేశారు.

కస్తూర్బా బాలికల విద్యాలయంలో తరగతి గదులు, వంట రూము, స్టోర్ రూంను ఆమె పరిశీలించారు. అక్కడ వసతులు సరిగ్గా లేవని విద్యార్థులు చెప్పడంతో ఆస్మా జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా వివరించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ విద్యార్థులకు సమస్యలను నేరుగా వచ్చి కలిసి చెప్పాలన్నారు.

విద్యార్థులకు ప్రభుత్వం కేటాయించిన మెనూ ప్రకారము భోజనం అందించాలని, వారికి ఎల్లవేళలా వైద్యం పట్ల జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాల్కల్ మండల బ్లాక్ ముఖ్య నాయకులు శారద భాస్కర్ రెడ్డి, మల్లికా రెడ్డి, స్నేహ, ఆసియా బేగం తదితరులు పాల్గొన్నారు.