18 August, 2026 | 1:18 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

అనుమానస్పద స్థితిలో వర్కర్ మృతి

11-11-2024 08:52 PM

న్యాయం చేయాలంటూ కంపెనీ ఎదుట బాధితులు ఆందోళన

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ కంపెనీలో బీహార్ రాష్ట్రానికి చెందిన అభిమన్యు అనుమానస్పదంగా మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు తమకు న్యాయం చేయాలని కంపెనీ ఎదుట రాస్తారో నిర్వహించారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు  కంపెనీ యజమాన్యంతో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్షనిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేగుంట ఎస్ఐని వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు  తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.