19 April, 2026 | 5:24 PM

మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

19-04-2026 03:49 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కుడికిల్ల గ్రామానికి చెందిన వెంకటేష్(35) అనే కార్మికుడు ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మత్తు పనులు నిర్వహించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు.

ఈ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో అతనికి షాక్ తగిలింది. దీంతో స్తంభం పైనుంచి జారిపడిన వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి కార్మికులు, ఉద్యోగులు అతనిని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.