13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

31-03-2026 12:49 AM

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): భావన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మహబూబాబాద్ జిల్లా నుండి హైదరాబాదులోని కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్ అంజయ్య భవన్ ముట్టడి కా ర్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు వెళ్లారు. సిఎస్ టెస్టులను రద్దు చేయాలని, వాటి స్థానంలో కార్మికులకు హెల్త్ కార్డు ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5000 పెన్షన్ ఇవ్వాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాల వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీలు నియమించాలని డిమాండ్ చేశారు.

సహజమరణాలకు ఐదు లక్షలు చెల్లించాలని, కానుకలుగా లక్ష రూపాయలు ఇవ్వాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, ప్రతి మండలంలో కార్మికులకు అడ్డా స్థలా లు కల్పించాలని తదితర డిమాండ్లతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోటేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడబోయిన శ్రీశైలం, జి ల్లా నాయకులు కొండ ఉప్పలయ్య, ములక మురళి, కారపాటి వెంకన్న, రాము, సైదులు, యాదగిరి, వీరన్న, బాబుగౌడ్, రాజయ్య, రవి, వెంకన్న, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.