13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

31-03-2026 12:48 AM

టీఆర్పీ నాయకుల డిమాండ్

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం ఉప్పెర మల్యాల గ్రామ రెవె న్యూ పరిధిలో నీటి కొరత కారణంగా ఎండిపోయిన పంట పొలాలను తెలంగాణ రా జ్యాధికార పార్టీ నాయకులు కొప్పుల వెంకటేష్ సోమవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ రిజర్వాయ ర్ కుడి కాలువ  నిర్మాణం జరగకపోవడంతో పరిసర గ్రామాల రైతులు నష్టాలు చవిచూస్తున్నారన్నారు.

ఉప్పెర మల్యాల వెం కంపల్లి  గ్రామానికి చెందిన రైతులు మల్యా ల అనిల్, మధుసుదన్ రెడ్డి, ముక్కెర పర్షరాములు తదితరుల ఎండిపోయిన పంటలను పరిశీలించి, వారి పరిస్థితిని తెలుసుకున్నారు. చెరువుకు కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న పొలాలు కూడా నీటి లభ్యత లేక ఎండిపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు.

ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కాలువ పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాం డ్ చేశారు.  పార్టీ  నియోజకవర్గ ఇంచార్జ్ కొప్పుల వెంకటేష్, గంగాధర మండల అధ్యక్షుడు ముక్కెర గంగరాజు, యువజన విభాగం అధ్యక్షుడు పలుమారి సతీష్, యూత్ ప్రధాన కార్యదర్శి బండ గంగరాజు, గుండవేణి నరేష్‌లున్నారు.