27 July, 2026 | 1:16 AM

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

27-07-2026 12:44 AM

సీఐటీయూ

దామరచర్ల, జూలై 26 : మండలంలోని నర్సా పురం లో భవన నిర్మాణ సంఘం గ్రామ కమిటీ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా ఎం మహేష్, కార్యదర్శిగా బి రాజు , సహాయ కార్యదర్శి ఎం రాజయ్య , కోశాధికారి చిన్న , మరి కొందరిని కమిటీ సభ్యులు గా ఎన్నిక అయ్యారు. సిఐటియూ మండల కార్యదర్శి బైరం దయానంద్బి మా ట్లాడుతూ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంఘం కార్మికులందరూ కూడా వెల్ఫేర్ బోర్డు కార్డు తీసుకోవాలని , కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు. వృద్ధాప్యంలో ఉన్న కార్మికులందరికీ రూ6 వేలు పింఛన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న చట్టాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాపన్నయ్య , విజయ నాయక్ పాల్గొన్నారు