14 April, 2026 | 5:00 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

సమస్యల పరిష్కారానికి కృషి

26-06-2025 01:05 AM

సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని

సనత్‌నగర్, జూన్ 25: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బుధవారం మోండా డివిజన్‌లోని బండిమెట్, సెకండ్ బజార్, మారుతి వీధి, సజన్‌లాల్ స్ట్రీట్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారం కోసం వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డీసీ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్,  డీజీఎం ఆశిష్, ఎలక్ట్రికల్ ఏడీఈ దుర్గాప్రసాద్, మోండా డివిజన్ ఆకుల హరికృష్ణ, నాయకులు ఉన్నారు.

తలసానికి ఆహ్వానం

బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం సందర్భం గా కూతురు నరసింహ కుటుంబ సభ్యులచే నిర్వహించే అల్పాహారం, అన్నదాన కార్యక్రమానికి రావాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మాజీ కార్పొ రేటర్ ఎన్ శేషుకుమారి, కూతురు నరసింహ, కట్టా బలరాం, మల్లికార్జున, అరుణ్ ఆహ్వాన పత్రికను అందజేశారు.

42 శాతం రిజర్వేషన్ కల్పించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తలసాని కోరారు. పార్టీల వారీగా రిజర్వేషన్ కాకుండా చట్టబద్ధంగా కావాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.