బయటకు వెళ్లిన బీఆర్ఎస్ జెడ్పిటిసిలు
కోరం లేక జెడ్పి సర్వసభ సమావేశం వాయిదా ?
సభ్యులతో సంప్రదింపులు చేస్తున్న ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా జెడ్పి సర్వసభ సమావేశం కోరంలేక వాయిదా పడింది. సమయానికి జెడ్పి సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ హాజరైనప్పటికీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీ చైర్పర్సన్ గా నియమితులైన స్వర్ణసుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో బీఆర్ఎస్ జెడ్పిటిసిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అందరం కలిసి జెడ్పి చైర్ పర్సన్ ను నియమిస్తే కాంగ్రెస్ లోకి వెళ్లినందుకు సర్వసభ్య సమావేశాన్ని చేస్తున్నట్లు బీఆర్ఎస్ జడ్పిటిసిలు సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ జడ్పిటిసి లను సముదాయించే పనిలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బైక్ కట్ చేసిన జెడ్పిటిసి లతో సంప్రదింపులు చేస్తున్నారు. జడ్పీ సమావేశ మందిరం నందు ఎమ్మెల్యేలు, చైర్పర్సన్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు వెలువబడలేదు.






