calender_icon.png 14 June, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలువండి

13-06-2025 11:22:09 PM

రేపు ప్రపంచ రక్తదాన దినోత్సవం

కరీంనగర్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ.... సామాజిక సేవ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తూ.... 54 సార్లు రక్తదానం చేసి 4500 మంది ప్రాణాలను కాపాడిన రక్తదాత గాలిపెల్లి కుమార్ యువతకు స్ఫూర్తి... ఆదర్శప్రాయుడు కరీంనగర్ డివిజన్ బొమ్మకల్ కి చెందిన గాలిపెల్లి అంజమ్మ దుర్గయ్య కుమారుడు గాలిపెల్లి కుమార్ ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న పెద్దల మాటలను కుమార్ అక్షర సత్యం చేసిన గాలిపెల్లి కమార్... అభినందనీయుడు, ఆదర్శప్రాయుడు.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. గాలిపెల్లి కుమార్. ప్రాణాపాయ స్థితుల్లో కొట్టుమిట్టా డుతున్న అనేక మందికి రక్త దానం చేస్తూ చేయిస్తూ తన మిత్రులతో తోటి వారితో చేయిస్తూ ఎందరో ప్రాణాలు నిలుపుతున్నాడు.

ఇప్పటికి 54 సార్లు రక్తదానం చేసిన మెగా బ్లడ్ డోనర్ గాలిపల్లి కుమార్ ఒక్క ఫోన్ కాల్తో ఎక్కడ ఉన్నా రక్త దానం చేస్తూ చేయిస్తూ ఇప్పటి వరకు 6500 మంది ప్రాణాలు కాపాడాడు. రక్త దాన చేతన్య యుద్ధం లో నేను సైతం అంటూ ప్రతి ఇంటిలో రక్త దాతను తయారు చేసే లక్షంగాముందుకు సాగుతున్నాడు. 120 మందికి పైగా కోవిడ్ వాళ్లకు ప్లాస్మా అందించి ప్రాణాలు కాపాడారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా 150 మందికి ఉచితంగా ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు కుమార్. కోవిడ్ నమయంలో కరీంనగర్ లో అన్న దానము చేసి అన్నార్తుల ఆకలి తీర్చాడు  గాలిపల్లి కుమార్ గత 14 సంవత్సరాలుగా రక్తదాన చైతన్య యుద్ధంలో నేను సైతం అంటు బ్లడ్ డోనార్, బ్లడ్ మోటివేటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు.

10వ తరగతి నుండి సామాజిక సేవచేస్తూ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఇప్పటి వరకు 54 సార్లు రక్తదానం చేశాను. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల ద్వారా 11,000 మందికి పైగా రక్తదానంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ఉన్న వారికి ఇప్పటి వరకు 6,500 మందికి రక్తం అందించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇప్పటి వరకు 52 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ప్లాస్మాదానంపై అవగాహన కల్పించి 60మందితో ప్లాస్మాదానం చేపించారు. ఆరోగ్యంగా ఉన్న 18-60 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న స్త్రీ, పురుషులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కుమార్ కోరారు. నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, రక్తదాతలందరికీ ప్రపంచ రక్త దాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.