08-08-2025 12:04:18 AM
మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఏటా ఆగస్టు మొదటివారం ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారంగా జరుపుకుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్‌పై అవగాహన పెంచేం దుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మీ, డాక్టర్ పృథ్వీ, పిడియాట్రిక్స్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ జనార్ధనరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు.