calender_icon.png 19 December, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

19-12-2025 04:33:37 PM

అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి.

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి(Sarpanch Kunchala Srinivas Reddy),  వార్డు సభ్యులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకి అన్నారం క్రాస్ రోడ్డు నుండి అన్నారం గ్రామం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎజెండాలోని మొట్టమొదటి కార్యక్రమం, రోడ్డు వెంబడి చెట్లు తొలగించి విస్తరణ కార్యక్రమం సర్పంచ్ తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు, అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. గ్రామ ప్రజలకు సేవ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనితో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.