calender_icon.png 6 May, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు

05-05-2025 12:48:10 AM

వనపర్తి టౌన్ మే 04: ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరిగినా ప్రతి నిమిషం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న పత్రిక మిత్రులకు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రేమ్ టైలర్ నానమోని మన్నెం.

వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో ప్రేమ్ టైలర్ ననమోని మన్నెం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసి కేక్ కట్ చేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సతీమణి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ ఆపర్ణ.

ఈ సందర్భంగా ఆమె చేతుల మీదుగా  వనపర్తి జిల్లా లోని విలేకరులకు శాలువా కప్పి సన్మానించి హెల్మెంట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విలేకరులు మరియు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.