calender_icon.png 5 May, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ భగీరథ మహర్షి జయంతి

05-05-2025 12:46:21 AM

మహబూబ్ నగర్, మే 4 (విజయ క్రాంతి) : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పద్మావతి కాలనీ లోనిర్వహించిన వేడుకలలో మహర్షి భగీరథ విగ్రహానికి  రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు   కలెక్టర్ మోహన్ రావుమాట్లాడుతూసమాజ హితం కోసం ఆనాడు భగీరథుడు అవిశ్రాంతంగా కృషి చేసి నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయుడయ్యారని కొనియాడారు. ఏదైనా కష్టమైన కార్యం సాధించాలంటే మహర్షి భగీరథుడి కృషిని ప్రస్తావిస్తూ, ఆ స్పూర్తితో ముందుకు సాగాల్సిందిగా పెద్దలు సూచిస్తారని గుర్తు చేశారు.

మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బి. సి . అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర, నగర పాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.