calender_icon.png 2 August, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమితలో ఘనంగా ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవం

02-08-2025 01:09:33 AM

కరీంనగర్, ఆగస్టు 1 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత సమన్వయకర్తలు  స్కార్ప్ లు ప్రధానం చేసారు.

ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినీ విద్యార్థులకు ప్రపంచ స్కౌట్ స్కార్ఫ్ దినోత్సవ శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్ రావు, వినోదరావు వి.యు.యం.ప్రసాద్, టి. ఎస్వీ. రమణ, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ ప్రశాంత్, కవిత, సమన్వయకర్తలు శ్రీనాథ్, మాళవిక,సరిత, లావణ్య, గైడ్ కెప్టెన్ రజిత, స్కౌట్స్ మాస్టర్ జిలానిలు, విద్యార్థినీ విద్యార్థులనుఅభినందించారు.