calender_icon.png 2 August, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి

02-08-2025 01:08:46 AM

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శనివారం విజ్ఞాన్‌భవన్‌లో జరిగే న్యాయ సదస్సుకు ఆయన హాజరవుతా రు. కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్ట అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఏఐసీసీ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, న్యాయపరంగా వదులుకోవాల్సిన అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.