ఫ్యూరీ ప్రైడ్ వాటర్ షాప్ ప్రారంభం
26-04-2026 01:53 PM
– యువత స్వయం శక్తితో ఎదగాలి: రవీంద్ర కుమార్
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూరీ ప్రైడ్ వాటర్ ఫిల్టర్ షాప్‌ను బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యూరీ ప్రైడ్ వాటర్ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు. యువత స్వయం శక్తితో ఎదగాలని, ప్రభుత్వం వారికి మరింత సహకారం అందించాలని కోరారు. షాప్ ఏర్పాటు అభినందనీయమని అన్నారు. అనంతరం రవీంద్ర కుమార్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.






