calender_icon.png 19 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్ల్యూపీఎల్ మహిళల క్రికెట్‌కు టర్నింగ్ పాయింట్

19-01-2026 12:50:46 AM

మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కామెంట్స్

హైదరాబాద్, జనవరి 18 : డబ్ల్యూపీఎల్ భారత మహిళల క్రికెట్ రూపురేఖలు మార్చేసిందని మాజీ కెప్టెన్, వుమెన్స్ క్రికెట్ లెజెం డ్ మిథాలీరాజ్ వ్యాఖ్యానించింది. మన అమ్మాయిలకు భయం లేని ఆటను అలవా టు చేసిందని పేర్కొంది. జూబ్లీహిల్స్‌లో లేయర్స్ క్లినిక్స్‌కు చెందిన లేయర్స్ ప్రైవ్‌ను మిథాలీరాజ్ ప్రారంభించింది. పురుషుల క్రికెట్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు అ మ్మాయిల క్రికెట్ మారిపోయిందని మిథాలీ చెప్పింది. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు ఎండలో ఆడుతున్నా సాధారణ అమ్మాయి ల తరహాలోనే స్కిన్ కేర్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని వ్యాఖ్యానించింది. క్రికెట్ ఆడుతు న్నా తాము కూడా బ్యూటీ టిప్స్ ఫాలో అవుతామంటూ చెప్పుకొచ్చింది.

లేయర్స్ ప్రైవ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు చెప్పిన  మిథాలీ క్లినిక్ అంతటా తిరిగి లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించింది. హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ ప్రమాణాలతో కూ డిన స్కిన్ ఎక్విప్‌మెంట్‌ను తీసుకొచ్చినట్టు లేయర్స్ క్లినిక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో కె.సుధీర్‌రెడ్డి చెప్పారు. మిథాలీరాజ్ లాంటి దిగ్గజ క్రికెటర్ తమ క్లినిక్ ప్రారంభోత్సవంలో భాగం కావడం సంతోషంగా ఉందని చీఫ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వాతి చెప్పారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్కిన్‌కేర్‌కు సంబంధించిన చికిత్సల ను అందిస్తున్నట్టు తెలిపారు.