calender_icon.png 19 January, 2026 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదర్భదే విజయ్ హజారే ట్రోఫీ

19-01-2026 12:49:23 AM

బెంగళూరు, జనవరి 18 : దేశవాళీ వన్డే టోర్నీ ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని విదర్భ జట్టు కైవసం చేసుకుంది. ఫైవల్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించి తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ థైడే (128) సెంచరీతో చెలరేగాడు. యాశ్ రాథోడ్ 54, మోఖడే 33 పరుగులతో రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వర్ 4, చిరాగ్ జని 2, చేతన్ సకారియా 2 వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష్యఛేదనలో సౌరాష్ట్ర 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ప్రేరాక్ మన్కడ్ (88), చిరాగ్ జని(64)  హాఫ్ సెంచరీలతో పోరాడారు. కీలక సమయంలో వీరిద్దరూ ఔటవడంతో సౌరాష్ట్ర 279 పరుగు లకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, భుటే 3, దర్శన్ 2 వికెట్లు తీశా రు. విజేతగా నిలిచిన విదర్భ జట్టుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వ ర్‌నాథ్ ట్రోఫీని అందజేశారు.