calender_icon.png 19 January, 2026 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ సమర్పయామి

19-01-2026 12:54:10 AM

చివరి వన్డేలో భారత్ ఓటమి

మిచెల్, ఫిలిప్స్ సెంచరీలు

తేలిపోయిన భారత బౌలర్లు

కోహ్లీ సెంచరీ పోరాటం వృథా

భారత్ గడ్డపై కివీస్ తొలి వన్డే సిరీస్ విజయం

కొత్త ఏడాదిని సిరీస్ విజయంతో ఘనంగా ఆరంభించాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. తొలి వన్డేలో గెలిచి జోరు మీద కనిపించినా తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి సిరీస్ సమర్పించుకుంది. ఇండోర్ వన్డేలోనూ బౌలర్ల ఘోర వైఫల్యం , బ్యాటర్ల ఫ్లాప్ షోతో సిరీస్‌ను చేజార్చుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీ పోరాటం, నితీశ్ హాఫ్ సెంచరీ, హర్షిత్ రాణా మెరుపు హాఫ్ సెంచరీ భారత్‌ను గట్టెక్కించలేకపోయాయి. ఫలితంగా భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయాన్ని కివీస్ చరిత్ర సృష్టించింది.

ఇండోర్ , జనవరి 18 : సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే తుది జట్టులో మార్పు చేసారు. వరుసగా విఫలమవుతున్న ప్రసిద్ధ కృష్ణ స్థానంలో అర్షదీప్‌సింగ్ జట్టులోకి వచ్చాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ నికోల్స్(0)ను అర్షదీప్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు పం పగా.. తర్వాతి ఓవర్‌లో కాన్వేను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. కాసేపు విల్ యంగ్, డారిల్ మిచెల్ కివీస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

జడేజా సూపర్ క్యాచ్ పట్టడంతో విల్ యంగ్(30) కూడా వెనుదిరిగాడు. దీంతో కివీస్ ఇక కోలుకోవడం కష్టమే అనుకుంటే ఫామ్‌లో ఉన్న మిఛెల్‌కు గ్లెన్ ఫిలిప్స్ జత కలిసాడు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. మిచెల్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా మరోవైపు ఫిలిప్స్ కూడా దూకుడు పెంచాడు. ఎప్పటిలానే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. ఆరంభంలో వికెట్లు తీసిన హర్షిత్ రాణా తర్వాత భారీగా పరుగులు ఇచ్చేసాడు. అటు సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపో యాడు.

ఇక నితీశ్ కుమార్‌రెడ్డి కూడా పూర్తి గా నిరాశపరిచాడు. స్పిన్నర్లు కూడా ప్రభా వం చూపలేకపోవడంతో మిచెల్, ఫిలిప్స్ జోడీని విడదీయడం భారత్‌కు సారధ్యం కాలేదు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 219 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మిఛె ల్  106 బంతుల్లో మరో శతకం సాధించగా.. అటు ఫిలిప్స్ కూడా సెంచరీతో అద రగొట్టాడు. దూకుడుగా ఆడిన గ్లెన్ ఫిలిప్స్ కేవలం 83 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లను వీరి జోడీ పూర్తిగా డామినేట్ చేసిందనే చెప్పాలి. చివరికి అర్షదీప్ సింగ్ ఫిలిప్స్(106; 9 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అర్షదీప్ ఔట్ చేయగా.. డారిల్ మిచెల్(137;15 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు సిరాజ్ పెవిలియన్‌కు పంపా డు.

తర్వాత వేగంగా ఆడే క్రమంలో కివీస్ వికెట్లు చేజార్చుకుంది. చివరికి న్యూజిలాం డ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ (3/63), హర్షిత్ రాణా(3/84), కుల్దీప్  (1/48), జడేజా(1/41), నితీశ్ 0/53) భారీ గా పరుగులు సమర్పించుకున్నారు. భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే షా కులు తగిలాయి. ఓపెనర్ రోహిత్ శర్మ మూడో వన్డేలోనూ నిరాశపరిచాడు. 2 ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన రోహిత్ (11), గిల్(23) వెంటవెంటనే ఔటయ్యారు. తర్వాత శ్రేయాస్ అయ్యర్(3), కేఎల్ రా హుల్(1) కూడా ఔటవడంతో భారత్ 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశ లో విరాట్ కోహ్లీ, నితీశ్ కుమార్ రెడ్డి జట్టు ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెం చరీలు పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్‌లో చివరి అవకాశాన్ని నితీశ్ సద్వినియోగం చేసుకున్నట్టే కనిపించాడు.

అయితే హాఫ్ సెంచరీ తర్వాత వెనుదిరగడంతో 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత జడేజా(12) కూడా ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమనుకున్నారు. ఈ పరిస్థితుల్లో కోహ్లీకి హర్షిత్ రాణా జత కలిసాడు. ఆల్‌రౌండర్‌గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న రాణా బ్యాట్‌తో మెరుపులు మెరిపిం చాడు. ఒకవైపు కోహ్లీ, మరోవైపు హర్షిత్ రాణా భారీ షాట్లు కొట్టడంతో సాధించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమం లో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వి రాట్‌కు ఇది వన్డేల్లో 54వ శతకం. అంతర్జాతీయ కెరీర్‌లో 85 సెంచరీ.  అటు హర్షి త్ రాణా కూడా భారీ సిక్సర్లు బాదుతూ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకు న్నాడు.

అయితే దూకుడుగా ఆడే క్రమంలో రాణా(52) ఔటవడం, మ రుసటి బంతికే సిరాజ్ డకౌటవడంతో భారత్ ఓటమి ఖా యమైంది. కుల్దీప్ సపోర్ట్‌తో కోహ్లీ మ్యాచ్ గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్నా భారీ షాట్లు ఆడే క్రమంలో కోహ్లీ 124 (10 ఫో ర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. త ర్వాత కుల్దీప్ కూడా ఔటవడం తో భారత్ ఇన్నింగ్స్ 296 రన్స్ దగ్గర ముగిసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను కైవ సం చేసుకున్న కివీస్ అరుదైన రికార్డు అం దుకుంది. భారత్‌లో తొలిసారి ద్వైపాక్షిక వ న్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. కివీస్ బౌ లర్లలో ఫౌల్క్స్ 3, క్లార్క్ 3, లెన్నా క్స్ 2 వికెట్లు పడగొట్టారు.    

స్కోరు బోర్డు 

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 337/8 (మిచెల్ 137, ఫిలిప్స్ 106, యంగ్ 30 ; అర్షదీప్ 3/63, హర్షిత్ రాణా 3/84, సిరాజ్  1/43)

భారత్ ఇన్నింగ్స్  : 296 ( కోహ్లీ 124, నితీశ్ రెడ్డి 53, హర్షిత్ రాణా 52; ఫౌల్క్స్ 3/77, క్లార్క్ 3/54, లెన్నాక్స్ 2/42)