భానుడి ప్రకోపం.. 20 బైకులు దగ్ధం
జగిత్యాల, మే 31 (విజయ క్రాంతి): భానుడి ప్రకోపానికి 20 బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. శుక్రవారం జగిత్యాల పట్టణంలో ని బైపాస్ రోడ్‌లో గల అనేశ్ అనే మెకానిక్ ఇంటి ఆవరణలో ఉన్న 20 బైకులు ఎండ తీవ్రతకు ఒక్కసారిగా వేడెక్కి మంటలు చెలరేగా యి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందు కు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. మంటల్లో బైకులు పూర్తిగా కాలిపోయాయి. మంటల తీవ్రత పెరిగి ఇంట్లోకి వ్యా పించి ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి కూడా బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల ను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో దాదాపు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు.
కుమ్మరిపల్లి కోళ్లఫారంలో
ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని కోళ్లఫారం కాలిపోయిన ఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకున్నది. గ్రామా నికి చెందిన అంబల్ల ప్రతాపరెడ్డి కోళ్ల ఫారం శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకోగా, సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.






